Header Banner

తస్మాత్ జాగ్రత్త! భారత్ ను మరోసారి టార్గెట్ చేసిన పాక్!

  Mon May 05, 2025 18:44        India

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ హ్యాకర్లు మరోసారి భారత్ను టార్గెట్ చేశారు. రక్షణ వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకుని భద్రతా ద ళాల డేటాను రాబట్టేందుకు ప్రయత్నించారు.పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్, పాక్ల మధ్య సంబంధాలు నిరంతరం దెబ్బతింటున్నాయి.

 

మరోవైపు పాకిస్థాన్కు చెందిన పలు సైబర్ గ్రూపులు భారత్పై సైబర్ దాడులకు దిగాయి. పాక్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. సైబర్ దాడుల ద్వారా భద్రతా సిబ్బంది లాగిన్ పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు రాబట్టేందుకు ప్రయత్నించారని రక్షణ సంస్థ వర్గాలు తెలిపాయి.

 

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్కు చెందిన సున్నితమైన డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసుకున్నట్టుగా పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాండిల్ పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ ఆర్మ్ వెహికల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేసేందుకు ఈ బృందం ప్రయత్నించిందని ఎన్డీటీవీ తెలిపింది.

 

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి అత్యవసర భేటీ! పహల్గామ్ దాడి తర్వాత..!

 

హ్యాకింగ్ ప్రయత్నాలు

కొన్ని రోజులుగా పాకిస్థాన్ నుంచి హ్యాకింగ్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడులను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా ఉంటున్నారు. పాకిస్థాన్తో ముడిపడి ఉన్న దాడులను కూడా పరిశీలిస్తున్నామని, ఇలాంటి దాడులను నివారించడానికి మరిన్ని భద్రతా చర్యలను పెంచుతున్నామని చెప్పారు.

 

డేటా యాక్సెస్

పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ హ్యాండిల్.. ఆర్మర్డ్ వెహికల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్ పేజీ చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో భారత ట్యాంకును పాక్ ట్యాంకుగా మార్చేశారు. మరో పోస్టులో భారత రక్షణ సిబ్బంది పేర్ల జాబితాను కూడా షేర్ చేశారు. 'మీ భద్రత ఒక భ్రమ. మనోహర్ పారికర్ డిఫెన్స్ స్టడీస్ వెబ్సైట్లో 1600 మంది యూజర్లకు చెందిన 10 జీబీ డేటాను యాక్సెస్ చేశాం.' అని ఆ హ్యాండిల్ పేర్కొంది.

 

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #CyberAttack #PakistanHackers #IndiaUnderAttack #PahalgamAttack #CyberSecurity #DefenceBreach